మూగబోయిన నా మనసు
మూగబోయిన నా మనసు
మూగబోయిన నా మనసుకు
మాటలు నేర్పాయి నీ పలుకులు
నవ్వు మరచిన నా అధరాలకు నవ్వుని.....
అందించాయి నీ తలపులు
చెదిరిపోయిన నా కలలకు
ఊపిరి పోశాయి నీ ఊహలు
తీరవనుకున్న నా ఆశలను......
తీరానికి చేర్చాయి నీ ఊసులు
ఆగదనుకున్న నా కన్నీటిని
కట్టడి చేశాయి నీ ఆలోచనలు
భారమైన నా బ్రతుకుకు........
ఆశలు కల్పించాయి నీ ఆదర్శాలు
వ్యర్ధమనుకున్న నా జీవితానికి
కొత్త భాష్యం చెప్పాయి నీ భావాలు
నీవు నా జతగా నూరేళ్ళు సాగగా.........
ఏ చింతా చేరదు నా చెంత

