STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మూగ ప్రేమ

మూగ ప్రేమ

1 min
394

ఇరు మనసులు పెళ్లి అనే బంధంతో ఏకమైనవి

అనురాగానికి తీపి గుర్తుగా ముచ్చటైన సంతానం

ప్రశాంతంగా సాగుతున్న అన్యోన్యం

ఊహించని కలతోకటి మార్చింది మా జీవితం

అంతా సర్దుకుపోతుంది అనే ఆశాకిరణం

కానీ మా మధ్య మిగిలింది భయంకరమైన మౌనం

చెంత ఉన్నా చేరువ కాలేని దూరం

నిశ్శబ్దంతోనే సాగింది సంసారం

ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ అనంతం

మనసు మనసుతోనే మాట్లాడుకునేది

ఇరువురికి ఎదుటివారి భావాలు అవగతం

వర్షంలో తను తడుస్తూనే

నాకు గొడుగు పట్టిన తీరు అమోఘం

తెలుపకనే తెలుపుతోంది అనిర్వచనీయమైన ప్రేమ

ఇవ్వలేను ఏ పేరు ఈ బంధానికి

బహుశా మూగ ప్రేమ అంటే ఇదేనేమో!!


Rate this content
Log in

Similar telugu poem from Romance