మత్స్య కన్య
మత్స్య కన్య
సముద్రపు అలలకు తెలియని చోట
తనకిష్టమైన స్నేహితులతో
మాట్లాడుతోంది మత్స్య కన్య
చేప తెచ్చిన కొత్త కబురు
పీత ఇచ్చిన పాత బహుమతి
ఎన్నో జలచరాలు
నీటి బుడగలు
అవి చెప్పే కథలు
ఒక్కసారి సముద్ర తీరాన
కాస్త సమయం గడిపి
ఓ రాతి బండకు ఆనుకుని
వచ్చే పోయే మనుష్యుల్ని చూడాలని
ఆశ పుట్టింది
అందరూ వారిస్తున్నా వినకుండా
పైకి సాగింది
అప్పుడే వేసిన వలలో చిక్కి
సముద్రానికి దూరమైంది
ఓ జంతు ప్రదర్శన శాలలో
మౌనంగా
మనకు ఆశ్చర్యం కలిగించేలా
అలానే ఉండిపోయింది
మత్స్య కన్య..
