STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మరుమల్లెలు

మరుమల్లెలు

1 min
327

మరుమల్లెల మత్తులో మనసు లయించే వేళ 

సోయగాల సొగసుల ఊహలు పలకరించే వేళ 

మరువపు సౌరు సుగంధ మైకము కమ్మే వేళ


ఒండొరు లేకమై తీయని ఊసులు కదిలే వేళ 

అలసిన తనువులు కలసిన సంతృప్తి పొందే వేళ

అరమూర్పు కళ్ళళో ఆనందం తాండవమాడే వేళ 


 నీరవ నిషీధి నిశ్శబ్ద గేయ మాలపిస్తోంది 

తలపుల తలుపులు తెరిచి తలపోస్తోంది 

తనువుల తపనల ప్రకంపనల తలపిస్తోంది 

ఊర్పులు లేని నిట్టూర్పులను వెలువ రిస్తోంది


ఎందరో చుట్టూ వున్నా అన్నీ వున్నట్లని పిస్తున్నా

ఆనంద మెరుగని ఒంటరితనము ఏమారుస్తున్నా

చీకటి తెరలేవో సంకెళ్ళై నిజేచ్ఛని హరిస్తున్నా

ఉరకలెత్తే మనసుని కర్కశముగా వారిస్తున్నా..!


... సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance