STORYMIRROR

Nannam Lokesh

Inspirational

4  

Nannam Lokesh

Inspirational

మరిచిపోలేని జ్ఞాపకాలు

మరిచిపోలేని జ్ఞాపకాలు

1 min
487

నిన్ను చూసినప్పుడు ఏర్పడినది

నువ్వు లేనప్పుడు కావాలని తపించేది

ఎంత వెతికిన దొరకనిది

అభిప్రాయాలతో చెప్పనిది

మనసుకు అర్థం అయ్యే భాషలో

చెప్పటానికి ప్రయత్నించాలో

ఎంటో ఈ మూగ మనసుతో

చెప్పుకోలేక, మింగలేక నాతో

నాకు నేనె సాటి అనుకోలేక

ఏర్పడినవి పంచుకోలేక


అభిప్రాయాలను, కోరికలను

ప్రతి చిన్న విషయాలను

దాచుకున్న ఈ చిన్న మందిరంలో

అర్థవంతముగా వివరించటంలో

సాహసముగా ప్రయత్నించిన

చెప్పలేక పోతున్నా అనిన

నువ్వు నమ్మిన విషయాలని

ఆవిరి కాకుండా కాపాడాలని

ప్రతిరోజు చేసిన ప్రయత్నాలు 

అక్షరాలు లేని కాగితాలు


మనసుకు కనబడినవి

చెప్పటానికి ప్రయత్నించినవి

అనుకున్నవి పేపరులుగా మిగిలిన

చేసే ప్రయత్నం మానలేదు అనిన

నీ మనసులోని భావాలను

ఈ మాటల రూపములోను

చెప్పటంలో నాకు మిగుల

ప్రీతికరముగా ఉన్నదిల

అని, నాలోని ఆశా భావాలు

ఈ మరిచిపోలేని జ్ఞాపకాలు



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational