STORYMIRROR

ARJUNAIAH NARRA

Abstract Inspirational

3  

ARJUNAIAH NARRA

Abstract Inspirational

మనుస్మృతి అంబెడ్కర్

మనుస్మృతి అంబెడ్కర్

1 min
359

చీమల కోసం ఇంటి ముందు చక్కెర పోస్తూ

పక్షుల కోసం ధాన్యపు కంకులు వేలాడేస్తూ

నిత్యం పంచ మహా యజ్ఞాలు చేస్తూ

పంచములంటూ హింసిస్తూ


విచక్షణ జ్ఞాన శూన్యులై 

బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర

పంచములు, అంత్యజులు, ఆవర్ణులు,

అతి శూద్రులు, నామ శూద్రులు, పరయాలు హరిజనులు , అస్పృస్యులు, అంటూ

అంటరాని కులాలను సృష్టించి


ప్రాధమిక సత్యం మరిచి

ప్రాధమిక హక్కులు విరిచి

మనవత్వాన్ని మరిచిపోయి

మనిషి జన్మకే మచ్చను తెఛ్చి


ఆలయ ప్రవేశం రద్దు, దేవుడిని పూజించవద్దు

నీటిని త్రాగవద్దు, గాలిని పీల్చవద్దు

నేలన నడవద్దు, మనిషిని తాకవద్దు 

జంధ్యం వేసుకో వద్దు, ఆభరణాలు దరించవద్దు

మంచి బట్టలు తోడ్కొవద్దు, మంచి ఆహారం తినవద్దు

ఊరి వీధుల్లో తిరగవద్దు, ఊరేగింపులు చేసుకోవద్దు

హిందువుల కుల కట్టుబాట్లు, వెలి, నిషేధం అంటూ

మూతికి ముంత ముడ్డికి చీపురు కట్టి

దూరచారాలకు, దూరగతాలకు పాల్పడితే


అనుభవించిన మనసోక ఆగ్నిగోళంమై

నిమ్నజాతుల హృదయాలలో

వేదన జ్వాలలు వెళ్లగక్కగా

కోట్లమంది మత మౌఢ్యా గుండెలలో

శత కోటి శతఘ్నులు బ్రద్దలుకాగా

నిమ్నజాతి ఋత్విజుడి చేతులలో

హోమంగా అగ్ని హోత్రుని చేరుకుంది

నీ మనుస్మృతి...


 



Rate this content
Log in

Similar telugu poem from Abstract