మంథనం
మంథనం
క్షీర సాగరాన్ని మథించగా హాలాహలము పుట్టెనట
శివుడా విషమును స్వీకరించెనట
ఆ వెనుక పుట్టిన అమృతమును దేవతలకు పంచెనట విష్ణువు మోహినీ రూపమున
మిత్రమా
నీ మనసే క్షీర సాగరము
మథించు దానిని
విషము వంటి ద్వేషమును అసూయను నిర్మూలించమని అర్థించు శివుని
అమృతము వంటి సధ్భుద్ధిని ఒసగమను విష్ణువును
ప్రపంచం నిన్ను నిన్నుగా ఉండనివ్వదు
నీలోని మంచితనం చేతకానితనం కాదని తెలుపు
పోరాడు నీతో నువ్వు
క్షమే అతి గొప్ప దానమని ఘోషించిన రామాయణం పూజించిబడు నేల ఇది
మిత్రమా
జాతుల మధ్య ద్వేషము కాదు ప్రేమను పెంచు
సర్వ మానవ సౌభ్రాతృత్వం కొరకు పాటుపడు