STORYMIRROR

Kadambari Srinivasarao

Inspirational

4  

Kadambari Srinivasarao

Inspirational

మనసున్న మాను

మనసున్న మాను

1 min
1.3K


విత్తును నాటిన తరువాత

మన ప్రమేయం దోసెడే కానీ

తాను మొలకై చిగురించి

మన జీవన గమనానికి

అలుపెరగని పోరాటం తాను చేస్తూ 

ప్రతి దినం ఫలాన్ని ఇవ్వడంలో

మనం నిదురించినా

తాను మాత్రం నిద్ర ఎరుగని సైనికుడిలా

మన శారీరక రక్షణకు పరితపిస్తుంది

కాసింత నీరు పోసిన మనకు

కాలానికి సరిపడు వర్షపు వరాలను కురిపిస్తుంది

ఊపిరి తీసే మనం వదిలిన గాలిని

తాను శివరూపమెత్తి

ఆ గరళాన్ని తన కంఠమందుంచి

అనునిత్యం ఉపిరిపోయడంలో

తాను ముందుంటుంది

మనలో శివం కనుమరుగైతే

శవాన్ని ఇంటివారే క్షణముండనీరు

విచక్షణ కోల్పోయి నిలువునా కోసినా ఇంటి గుమ్మమై, మంచమై, అసనమై.. దశావతారాలెత్తి

నాటిన రుణం తీర్చుకుంటుంది

భూమాత మానస పుత్రిక మనసున్న మాను

సృష్టి, స్థితి, లయల స్వరూపంగా

జగమున ఆరాధ్య దేవత

అందుకే చెట్టు నా ఆదర్శ గురువు


Rate this content
Log in

Similar telugu poem from Inspirational