మనసునెలా దోచినావొ
మనసునెలా దోచినావొ
మనసునెలా దోచినావొ..తెలియలేదు అసలు..!
నీవు ఎలా ఉంటావో..చూడలేదు అసలు..!
పరిహసించు సెలయేటిని..ఎలా చూపగలను..
ఈ తియ్యని విరహవీణ..మ్రోగలేదు అసలు..!
నీ టక్కరి వలపులతో..సమరమేల ముగియు..
చీకటింటి సితార ఇది..పలుకలేదు అసలు..!
పాటసారినైతి నీ తియ్యని తలపులతో..
ఎటుచూస్తే అటుముళ్ళే..బాటలేదు అసలు..!
దయేలేని నీకన్నా..చెలికాడే వద్దు..
నిన్నుపొగడ తగినభాష..దొరకలేదు అసలు..!
రాజెవరో పేద ఎవరొ..చెలిమిధనం ముందు..
ప్రాణాలకు ప్రాణమదే..అందలేదు అసలు..!
సన్నజాజి తీగతోటి..మంతనాల కేమి..
మనసు పలికే ..చిక్కలేదు అసలు..!

