మనసున
మనసున
మనసున పొంగే..రాగం అడుగకు..!
అనురాగానికి..స్వరములు పొదగకు..!
సం వేదనలను..గమనిం చడమే..
ఓర్పుకు నిఘంటు..అర్థం చూడకు..!
"వినదగు నెవ్వరు..చెప్పిన" నిజమే..
పాఠం మాత్రం..ఎవరికి చెప్పకు..!
మాయకు అద్దం..ఉండదు వేరుగ..
"జగమే మాయ"ను..పాటను మరువకు..!
ఊహల రేవున..ఊసులు దేనికి..
"పగలే వెన్నెల"..తోటను వీడకు..!
కొలిమిని కాలిన..పసిడికె నిగ్గులు..
అలుకల కొలికికి..సిగ్గులు నేర్పకు..!
