STORYMIRROR

VENKATALAKSHMI N

Action Fantasy Others

4  

VENKATALAKSHMI N

Action Fantasy Others

మనసు తడి

మనసు తడి

1 min
406

పొట్లపాది మనస్తత్వం వాళ్ళది

ఎవ్వరితోనూ కలవరు

ఎవ్వరినీ కలవనివ్వరు

చూసీ చూడని నైజం

తనదాకా వస్తేనే ఉలికి పడతారు

అంటీ అంటనట్టు వుండి

చోద్యం చూస్తుంటారు

వింత పోకడలతో వినోదిస్తారు

చివరకు చేతులు కాలాక

చురకలతో ఎచ్చరిక మీదొస్తారు

అప్పుడు..నాది నేను అన్న నోరు

మనది మనమని భుజం తడతారు

ఊసరవెల్లి వేషంతో ఊదరగొడతారు

శకుని లా శకునాలు పలుకుతారు

నీతులను నాలుకకు అతికిస్తారు

పరకాయ ప్రవేశంలో దిట్ట వీళ్ళు

తడి గుడ్డతో గొంతులు కోసే రకం

తీరం చేరని పొడి పొడి

మాటలను నమ్మకండి

వివేకం విచక్షణలతో మనసుతడి

కలిగిన వాళ్ళను గుర్తించండి

బంధాల‌ విలువను పెంచండి


Rate this content
Log in

Similar telugu poem from Action