మనసు ప్రణయగీతిలా
మనసు ప్రణయగీతిలా
ఈ మనసును ప్రణయగీతిలా మలచెను తాను..!
వర్షించే మౌనముగా..నను మార్చెను తాను..!
దివ్యకాంతి లోకమొకటి..బహుమతిగా ఇచ్చె..
జన్మ గుట్టు చూపులతో..ప్రవచించెను తాను..!
ఒక రాలని మరివాడని..సుమహాసం తనది..
పరిమళించు వెన్నెలగా..మదినిండెను తాను..!
తలరాతని చింతించే..పనిలేదట ఇంక..
ప్రస్తుతమున జీవించుట..నేర్పించెను తాను..!
అనుభవాల కావ్యసుధా..మాధురితో తడిపె..
విరహమనే భావననే..తుడిచేసెను తాను..!
ఎవరికేమి చెబుతావిక..వినుములోన సరిగ..
అసలు వేదసారమునే..వడ్డించెను తాను..!

