STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Tragedy

4  

Dinakar Reddy

Abstract Drama Tragedy

మనసు పలికేను నీ మౌనం

మనసు పలికేను నీ మౌనం

1 min
298

రాగ ద్వేషాలు సరిలేని సుఖాలు

సరిపోని బాసలు 

నీ పేరు పలికేటప్పుడు నాలో వేడి ఆవిరులు

ఎక్కడో దూరంగా నువ్వు

నిన్ను చూడకుండా నేను


ఎవరి ఎడారినో నందనవనం చేస్తూ

ఎవరి వాకిట్లోకో ఆనందాన్ని తెస్తూ

ఎవరి కౌగిట్లోనో సుఖాన్ని పంచుతూ

బరువులు అందుకుంటూ కష్టంలో ఆదుకుంటూ

నువ్వు బాగానే ఉన్నావ్

నీ పేరు ఇక్కడి దాకా వినిపిస్తోంది


అబ్బే

ఇష్టమని కాదు

కొంత మంది ద్వారా వినాల్సి వస్తోంది

అసలీ వార్తలు మోసేవాళ్లు మనుషులేనా


ఎంత విడ్డూరంగా చెబుతారు

నువ్వు నేనెవరో తెలీదు అన్నావట

కనీసం నా పేరు కూడా వినలేదు అన్నావట

అప్పట్నించీ ఈ మనసు మౌన వ్రతం పట్టింది



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract