మనసు మరీ
మనసు మరీ
మనసు మరీ హత్తుకొని తూలిపోతుందే
అలా సొగసు చేరి పొత్తు కోరి అల్లాడిపోతుందే
ఎలా కలలో కూడ కవ్విస్తుందే కళ్ళతో మాట వినకా
అలలా ఊపేస్తుందే అసలా చూపులతో కనకా అణువులో
అణువై అంకితమే చేసి పోతుందే తనువులో తనువై
తన్మయమై కలసిపోతుందే పూల వారధి పున్నమి తీరమే
తీరుగా చేర్చులే కలల సారధి ప్రయత్నం చేసి ఫలితం మార్చులే
మార్గమే చూపిన ఆమనికి మరిచిపోని సృతులే స్వర్గమే
దిగివచ్చి దీవించీ ఇచ్చిలే అనుమతులే పండుగేలే పరువానికి
పరువళ్ళతో పరిశ్రమించి దండుగే చేయకూ ఆ దరహాసాన్ని
అదను లోనే విశ్రమించి పరిఢవించే ప్రణయానికి పంకజాలై
పల్లవించనీ అనుభవించే ఆశలను అంబుజాలై గమనించనీ....

