STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

మనసు కాలిన వాసన

మనసు కాలిన వాసన

1 min
6


జీవితం అపుడపుడు పొగసూరుతుంది
ఓటమి అంచున దుఃఖంతో మసకబారుతుంది
ఏదో తెలియని వేదన, ఆవేదనలతో మనసు
ఆ మనసు నుంచి ఏదో ఒక కాలిన వాసన

గుండె పగిలిన గడియల్లో జ్ఞాపకాల దొంతరలు 
ఒక్కొక్కటిగా సూదుల్లా గుచ్చుతున్న గతాలు
ఎడతెరిపిలేకుండా వెంటాడుతున్న వేదనలు 
జీవితమంటేనే అగ్నిపరీక్షల సంవేదనలు

మనిషి పైకి గంభీరంగా ఉన్నా ఏదో వెలితి 
లోలోన కుమిలేటి బాధలు బహిర్గతం కావు
సానుభూతులు, సహానుభూతులు సరి కావు 
అనుభవిస్తే తప్ప అర్థం కాని అంతరంగాలు

బతుకంతా రాబందుల చేతుల్లో ఓటమి
నమ్మిన వారుగా నట్టేట ముంచిన కూటమి
వైకుంఠపాలి లోని పాముల్లా మింగిన వైనం 
జీవితం ఓ అడుగు ముందుకు, మూడు వెనక్కు 

మనసంతా తీరని గాయాలతో హూనం 
ఒక్కటి మానితే, రెండోది సలుపుతూ హననం
గెలుపు ఓటముల పోరులో తప్పని యుద్ధం 
దేనినైనా ఎదుర్కొనేందుకు మొండిగా సిద్ధం

వ్యక్తి సమాజంతో పెనవేసుకున్న బంధం 
తరిగిన ఈ మానవ సంబంధాలతో ఖేదం 
ఈర్ష్య ద్వేషాలతో కలుషితమైన మనసులు
రగిలిన మనసుల నుండి ఏదో కాలిన వాసన 

ఒకనాడు పరిమళాలు చిమ్మిన మనసులు 
నేడు దుర్వాసనలతో దగ్ధమవుతున్న దృశ్యాలు 
పగలు, పంథాలు, ప్రతీకారాలతో రగిలే దశలు
మారిన బంధాల్లో మనసు కాలిన వాసనలు !!


Rate this content
Log in

Similar telugu poem from Classics