మనసు గుడిలో కొలువు
మనసు గుడిలో కొలువు
చిలిపిపూవుల మేఘమల్లే..కురిసినందుకు నవ్వనా..!
వలపుగంధం మదిని దాచుకు..గిచ్చినందుకు నవ్వనా..!
మనసు గుడిలో కొలువు తీరిన ముచ్చటెంతో హాయిలే..
తిరిగి చూడక వలపుతంత్రులు త్రెంచినందుకు నవ్వనా..!
కలల గగనపు రాజహంసగ..హృదయమేలే జాణవే..
వింతవిరహపు వనములో నను..నిలిపినందుకు నవ్వనా..!
ఎన్ని మాటలు చెప్పినావో..చెరువుగట్టున తియ్యగా..
మోసపోయిన వెర్రి మనసే..ఏడ్చినందుకు నవ్వనా..!
శర్మగారిది సరస గంభిర..గజల్ హృదయము చూడగా..
వారి మత్లా భావమేమో..చెదిరినందుకు నవ్వనా..!
చెలిమివీణియ బహుమతిచ్చిన..మెఱుపుతీవయె తానుగా..
కరుణరాగపు సుధలు పంచక..మాడ్చినందుకు నవ్వనా..!
తప్పులెన్నో దొర్లుతుంటే..తాను సవరణ చేయునే..
దిద్దుకోగా అహము అడ్డుగ..నిలిచినందుకు నవ్వనా..!
సిగ్గుమొగ్గల రాశులెన్నో..కురియుటెంతో విందులే..
విస్తుపోతూ తారలెన్నో..మూల్గినందుకు నవ్వనా..

