మనసు చిత్రాలే
మనసు చిత్రాలే
తాను పాడుతూనె ఉంది..పెదవి విప్పకుండానే..!ప్రే
మ పంచుతూనె ఉంది..కనులు ఎత్తకుండానే..!
ఒక నచ్చని తనమేదో..ఉంటున్నది మాటలలో..
మనసు అలుగుతూనె ఉంది..తెలివి అందకుండానే..!
ఓ పాటకు పల్లవిలా..తనతోనే జీవితమే..
పట్టు తప్పుతూనె ఉంది..స్వరం చిక్కకుండానే..!
అక్షరాలెపుడూ మౌనంలోనె ఉంటాయి కదా..
నీడ ఆడుతూనె ఉంది..నిప్పు వీడకుండానే..!
కథలేం కలలుకాదు..నిజానికి మనసు చిత్రాలే..
తలపు మరుగుతూనె ఉంది..తళుకు తగ్గకుండానే..!
నిద్రలోకి జారిపోకు..కళ్ళు తెరిచే మనసు..
ముద్దు కరుగుతూనె ఉంది..మంచు అవ్వకుండానే..!

