మనసంతా
మనసంతా
నా కనులలో దాగిన కలలన్నీ
నిన్నే నాకు అందంగా చూపెడుతుంటే
ఇలలో నీవు నా చెంత లేకున్నా
కలలో నాతోనే ఉన్నారని భ్రమిస్తూ
విశ్వమంతా నీ కోసం గాలిస్తూ
నీరాకకై నిరీక్షిస్తూ
నువ్వొస్తావని ఆకాంక్షిస్తూ
జ్ఞాపకాల పూవులను పోగేస్తూ
నీతో గడిపిన మధుర క్షణాలను
మనసారా తలచుకుంటా
మనసంతా నిండిన నీ రూపాన్ని
మరలా మరలా తలచుకుని తరిస్తూ
నిను చేరే ఆ తరుణం కోసం
వేచి చూస్తున్నా ఆశగా ...

