STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మనసారా

మనసారా

1 min
371

కష్టమెంత పెద్దదైన తట్టుకోని బతకనివ్వు 

కాష్టానికి పోతున్నా వీడిపోని బంధమివ్వు


అర్థమవని బతుకు పుటలు ఆవేదన తలరాతలు 

అలసి ఆగిపోతున్నా….తుదివాక్యం రాయనివ్వు


ఆశ అలసిపోతున్నది బతుకు ముగిసిపోతున్నది 

సెలవంటూ వెళుతున్నా చివరిపాట పాడనివ్వు


నేనన్నది నాదన్నది ఏమున్నది అహము తప్ప 

పెను యుద్ధం చేస్తున్నా వీలైతే గెలవనివ్వు


ఊసుపోక నువు చేసిన బొమ్మే కద ఈ సత్యా!!

ఉసురు తీసివేస్తున్నా మనసారా నవ్వనివ్వు 



Rate this content
Log in

Similar telugu poem from Romance