మనసారా
మనసారా
రంగవల్లిలా మారింది కాలం..
నువ్వు చేసింది ఈ ఇంద్రజాలం..
నీ ప్రేమ లేని ఈ జీవితం శూన్యం..
నీ తోడు కావాలి నాకు కలకాలం..
కనులు మూసిన ప్రతి క్షణం,
కనులలో కదలాడు నీ రూపం..
కనులు తెరచిన ప్రతి నిమిషం,
కనుపాప వెదకేసు నీ కోసం...
మది నిండిన ఊసులతో, మరువరానిది నీ స్నేహం..
మనసారా ముచ్చటించ, చేర రావా నా కోసం..!!
... సిరి ✍️❤️

