మనసా తుళ్ళి పడవే
మనసా తుళ్ళి పడవే
పర్లేదు
మనసా కాస్త తుళ్ళి పడవే
ఇంకాస్త ఆశపడు
మరో హృదయంలో చోటు కోసం
ఆరాటపడు
అవును అనే జవాబు రావొచ్చు
లేదా
నీ హృదయం పగిలి కన్నీరు రావొచ్చు
అందుకని
ప్రేమించనంటావా?
నీకు తప్పక ప్రేమ దొరుకుతుంది
ప్రేమిస్తూ ముందుకు వెళ్లు
మనసా కాస్త తుళ్ళిపడు
పర్లేదు

