STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

మనోసాగరం

మనోసాగరం

1 min
9

నా మనోసాగరంలో నీవు రేపిన అలజడి..

ఒక తుఫానుగా మారింది. నీవు నిశ్చలమైన చెలియలికట్టవై....

నిన్ను తాకాలనుకొని, తాకలేకపోతున్న నా మనోసాగర తరంగాలను

పరిహసిస్తున్నావు ఇది నీకు న్యాయమా?

ప్రతి క్షణం చేసే ప్రయత్నంలో ఎప్పటికైనా సఫలీకృతుడనౌతాను.

ఈ తుఫాను క్షణ క్షణానికీ మరింత ఉధృతమౌతుంది.

కెరటాలు మరింత ఎగసి పడి నిన్నో రోజు తప్పక తాకుతాయి.

తాకడమే కాదు ఆ కెరటాలు నా ప్రేమ ప్రవాహంలో నిన్నుముంచేస్తాయి.

ఆ ప్రేమ విద్యుద్ఘాతంతో నా ప్రేమ స్పర్శను గ్రహిస్తావ్.


Rate this content
Log in

Similar telugu poem from Romance