మనిషిలాగ
మనిషిలాగ
మనసులేని మనిషిలాగ పారిపోతున్నాం
నలుగురికీ వెలుగివ్వక ఆరిపోతున్నాం
పదిమందిలొ కలిసుండే తత్వం లేదోయ్
మందినుండి జావలాగ జారిపోతున్నాం
వాడెవడో అన్నాడని పిరికితనం వద్దు
శతృవుపై గెలిచిమరీ ఓడిపోతున్నాం
నీకునీవె దూదిలాగ ఎగిరిపోతుంటే
కనిపించని గగనంలో కాలిపోతున్నాం
పుట్టుకతో మనిషివైన, ప్రవర్తనె విచిత్రం
వనంలోన మృగంలాగ మారిపోతున్నాం
