మనిషి తప్పు
మనిషి తప్పు
పువ్వులతో చెలిమిచేస్తె దేవునిదరి చేరుకోద పురుగైనా
గుడిలోపల ప్రతిష్టిస్తే దేవునిలా మారిపోద రాయైనా
పుట్టుకతో కాదు వున్న స్థానానికి విలువుందీ ఎపుడైనా
నుదురుచేరి దైవత్వం కోరుకోద చితిలోపలి ఊదైనా
కాలిమీద వేసిననూ తలమీదను పోసిననూ విలువపోదు
శంఖంలో పోయగానె తీర్ధంలా మారిపోద నీరైనా
కాళ్లకింద తొక్కిననూ పనికిరానిదేదిలేదు లోకంలో
వండుకున్న కుండలాగ మారిపోద కాళ్లకింద మట్టైనా
మనిషితప్ప ఏదైనా ఉసురుపోతె పనికొచ్చును తెలుసుకదా
ఢక్కలాగ మారిపోద చనిపోయిన మృగంయొక్క తోలైనా
