మంగళదాయిని
మంగళదాయిని
.వీరుల కన్నతల్లియగు పెన్నిధి మంగళ దాయినౌ శుభా
.కారత నిచ్చు దేశమిది కమ్మని భాషల మేళవింపు మా
.భారత మాతకిచ్చెదను బంగరు పుష్పపు హారముల్ సదా
.చారము తో మెలింగి మన సంస్కృతి నెల్లెడ నిల్పువారమై
.భారత మాత గీతములు పాడుచు నుందును భక్తి తోడ సా
.కారము కాగ స్వప్నములు గౌరవమొప్పగ నిల్తునీ భువిన్//
