మండే శక్తి
మండే శక్తి


స్వరాజ్యం జన్మహక్కన్నారు తిలక్
సమ్మె చేసే హక్కే లేదంది న్యాయస్థానం
ప్రతీకార్మికుడు జీవించే హక్కుందంది చట్టం
పోరాటం లేని జీవితముంటుందా ?
జీవించడానికి ఉద్యోగి చేసే ఆరాటమే పోరాటం
జీవితమే అనుక్షణం పోరాటం
గర్భస్థ శిశువు భూమిపైకి రావడానికి పోరాటం
పోటీ ప్రపంచం తట్టుకోవడానికి విద్యార్ధి పోరాటం
ఆవేశాల తనయుడితో అనుభవాల తండ్రి పోరాటం
జీవిత పాఠాలు నేర్వడానికి వయసుతో పోరాటం
పెరిగే ధరలతో పెరగని జీతంతో ఉద్యోగి పోరాటం
చాలీచాలని గుడ్డలకి చలితో బిచ్చగాళ్ళ పోరాటం
బాధ పెట్టె భర్త తో పిల్లల కోసం భార్య పోరాటం
కాలే కడుపు నిండడానికి ఆకలితో అన్నార్దుల పోరాటం
తరగని బాధ్యతలతో అలుపెరుగని తండ్రి పోరాటం
నకిలీ విత్తనాలకి చేసిన అప్పులతో అన్నదాత పోరాటం
న్యాయం నడిపించేందుకు, అన్యాయంతో సత్యం పోరాటం
కాని...కార్మికుడు మాత్రం చేయరాదు పోరాటం
పెంచమనరాదు జీతం ..ఇవ్వమనరాదు పెన్షన్
ఎంత నిరంకుశత్వం ...వారికి తెలియదు
అరచేతినడ్డుపెట్టి సూర్యకాంతి నాపలేరని
చేయి చేయి కలిపిన కార్మిక శక్తంటే మండే సూర్యుడని
కార్మిక శక్తంటే ఖాకీ బట్టలతో తలనెరిసిన అరవైయేళ్ళ యువకుల శక్తని
రక్తపుటేరులు పారినా పోరాటానికి జంకనిది కార్మిక శక్తని
(తమిళనాడులో కార్మికులకు వ్యతిరేకంగా రూల్స్ ప్రతిపాదించిన నేపధ్యంలో)