మంచి మిత్రుడు
మంచి మిత్రుడు
ఆప్తమిత్రుడున్నచో నంబరంబున కెగర వచ్చు
సప్త సాగరంబులందు సాగవచ్చు
ప్రాణస్నేహితుండు మనకు పలుకు తోడు
మంచి మిత్రుని యెపుడు మరువ రాదు.
బాల్యస్నేహితుని గాంచ భారంబు తొలగును
సచివుని తోడు సౌఖ్యంబు నిడును
నెయ్య మన్నది భువిలోననిలిచి యుండు
మంచి మిత్రుని యెపుడు మరువ రాదు.
సజ్జనుండగు మిత్రుని సాంగత్యమును కోరి
చదువులెన్నియో చదివి జగతి యందు
సకల సంపదలన్నియు పొంద వచ్చు
మంచి మిత్రుని యెపుడు మరువరాదు.
పేదరికమునందు, పెద్దతనమునందు
ప్రాణ సంకటమందు, బాధలందు
ధైర్యమిచ్చువాడు దయగల మిత్రుడు
మంచి మిత్రుని యెపుడు మరువ రాదు.
-----------------------
