బొమ్మరిల్లు
బొమ్మరిల్లు
సాయంపు కాలంబు సంద్యా సమయములో
ప్రాయంపు నాటలో బాల్యంపు వయసులో
కడలితీరంలోన గంతుతూ పోదామా
వడివడిగ నిసుకలో పరుగెత్తి పోదామా!
చల్లనౌ నీటిలో స్నానం చేద్దామా!
పిల్లలం!అల్లరిగ వేడుక చేద్దామా!
బొమ్మరిల్లునిప్పుడు పొందుగా కడదాము!
కమ్మగా పాటలను కలిసి పాడేద్దాము!
