STORYMIRROR

Midhun babu

Children Stories Fantasy Children

3  

Midhun babu

Children Stories Fantasy Children

అమ్మా మనసు

అమ్మా మనసు

1 min
2

తనను మరచి బిడ్డసుఖము..చూసేదే అమ్మమనసు..!

మృత్యువుతో పోరాటం..సలిపేదే అమ్మమనసు..! 


మంచితనపు నిర్వచనం..దాగున్నది తన కన్నుల.. 

వెన్నకన్న సుతిమెత్తగ..ఉండేదే అమ్మమనసు..! 


బ్రతుకును ఒక భారంగా..తలచలేదు అసలు తాను.. 

కష్టాలను దిగమ్రింగుతు..నవ్వేదే అమ్మమనసు..! 


అనంతమౌ మౌనాలయ దీపమేగ ఆ హృదయం.. 

అనుక్షణం ధ్యానంతో..వెలిగేదే అమ్మమనసు..! 


ఆనందమె తనసంపద..అనుభవమే తనకు గురువు..! 

ప్రవహించే ప్రేమనదిగ..మిగిలేదే అమ్మమనసు..! 



Rate this content
Log in