STORYMIRROR

Midhun babu

Children Stories Classics Inspirational

3  

Midhun babu

Children Stories Classics Inspirational

అడుకోగ

అడుకోగ

1 min
4


అందమైన గాలిబుడగ..అందెనుగా ఆడుకోగ..!

మెఱుపుపూల తోట ఏదొ..దొరికెనుగా ఆడుకోగ..!


అమాయకత ఉట్టిపడే..బాల్యమేగ స్వర్గమంటె..

పలురంగుల లోకమేదొ..విరిసెనుగా ఆడుకోగ..!


లేదు ఆశ..లేదు ధ్యాస..'నేను,నాది' గొడవలేదు..

లాలించే అమ్మ ఒడే..మిగిలెనుగా ఆడుకోగ..!


పుస్తకాల పురుగులాగ..మారాల్సిన పనేలేదు..

ఈ-చదువుల చక్రమేదొ..దక్కెనుగా ఆడుకోగ..!


చిరునవ్వుల దీపంలా..వెలుగు ముచ్చటేది ఇపుడు..

రాజకీయ 'చెద'రంగం..పట్టెనుగా ఆడుకోగ..!


Rate this content
Log in