బాల్యమదే
బాల్యమదే
1 min
1
అసలు సిసలు దైవత్వం..వర్షించును బాల్యమదే..!
అమాయికతను మనసుతో..దర్శించును బాల్యమదే..!
ఆటలైన పాటలైన..ఎంత ముద్దుగుంటాయో..
తడుస్తున్న ధ్యాస లేక..పులకించును బాల్యమదే..!
అమ్మ కోపపడిన వేళ..చేరునుగా కొంగుచాటు..
గద్దిస్తూ తల తుడవ..పరవశించును బాల్యమదే..!
చిన్ని కోడి పిల్లనైన..సొంత చెల్లిలాగ తలచు..
అపురూపత మదినిండ..ఆదరించును బాల్యమదే..!
మాటలలో చెప్పలేని..ప్రేమనదిగ మనసుండును..
ప్రతిజీవికి తను తినేది..తినిపించును బాల్యమదే..!
