అమ్మ
అమ్మ
1 min
2
ఎన్నివున్నా అమ్మ దూరమైన
కమ్మదనమేది బ్రతుకున...
అమ్మ ఉంటే సంబరం
అమ్మ మనసు అంబరం
అమ్మఒడి సాటియైన చోటేది విశ్వంలో
అమ్మతనమంటి అనుబంధమేది అవనిలో
పేగు పంచిన అమ్మవంటి అన్నమున్నదా
ఆకలంటి ఒంటరితనాన...
అమ్మ ఒంటి ప్రాణమేకదా
అల్లుకున్న సృష్టిఅంతా....
అమ్మ చేతిస్పర్శ తలను తాకినా
తల అమ్మ పాదాల మ్రొక్కినా
మరుజన్మలేదు మోక్షలోకం చేరగా...
స్వర్గమైనా నరకమేగా అమ్మలేని తావులో
