STORYMIRROR

Midhun babu

Children Stories Classics Fantasy

3  

Midhun babu

Children Stories Classics Fantasy

అమ్మ తనం

అమ్మ తనం

1 min
1

అక్షరాల వర్ణించగ..అందదులే అమ్మతనం..!

ప్రేమకు నిజ అద్దంలా..ఉండునులే అమ్మతనం..!


లాలిపాట లోయలలో..పూలతోట తన మనసే.. 

గగనమంత ఊయలయై..నిలచునులే అమ్మతనం..! 


తన చేయే వెన్నుపైన..రాస్తుంటే ఎంత హాయి.. 

ఏవేవో లోకాలను..చూపునులే అమ్మతనం..! 


మౌనమైన పెనుమమతల..కోవెలయే ఆ హృదయం.. 

మనసు శూన్య మవ్వకుండ..దక్కదులే అమ్మతనం..! 


గజలు వ్రాయు దీక్షకన్న..కవికి తపం ఏమున్నది.. 

తడిమట్టిగ మిగులకున్న..తెలియదులే అమ్మతనం..! 



Rate this content
Log in