బాల్యమే
బాల్యమే
1 min
2
పడేపడే చినుకులలో..పడవలాగ బాల్యమే..!
కొమ్మలలో కోకిలమ్మ..పాటలాగ బాల్యమే..!
గాలిమరలు తిప్పుకుంటు..ఆడుకున్న రోజులే..
జలుబులేక జ్వరములేక..ఆటలాగ బాల్యమే..!
గంజికన్న బలమైనది..ఏ విటమిన్ టానికో..
యేటిగట్టు నీటిచెలమ..ఊటలాగ బాల్యమే..!
గంగరేగు బొప్పాసుల..బలమెవరి కందెనో..
చెఱకుతీపి గున్నమావి..తోటలాగ బాల్యమే..!
పలకాబలపాలు పట్టి..ఏమి నేర్చుకొంటిమో..
మరువలేని జ్ఞాపకాల..కోటలాగ బాల్యమే..!
