అమ్మ
అమ్మ
1 min
4
అపురూపత సొంతమైన..ప్రేమమూర్తి అమ్మ..!
ఆత్మీయత వర్షించే..అమృతమూర్తి అమ్మ..!
గుండెలయను రంగరించి..జోలపాడు తాను..
అనురాగమె ఆస్తియైన..స్వర్ణమూర్తి అమ్మ..!
ఎంత సేవ చేస్తుందో..ఏ స్వార్థము లేక..
తృప్తికి చిరు నామా కద..కరుణమూర్తి అమ్మ..!
అమ్మమ్మగ..నాన్నమ్మగ..చెల్లెమ్మగ తనే..
పెద్దమ్మగ..అత్తమ్మగ..దివ్యమూర్తి అమ్మ..!
అక్కమ్మగ..వదినమ్మగ..జేజమ్మగ కాచు..
అస్థిత్వము మైమరచిన..త్యాగమూర్తి అమ్మ..!
