అమ్మ ప్రేమ
అమ్మ ప్రేమ
1 min
1
మాటలలో నింపేందుకు..అందనిదే అమ్మప్రేమ..!
రుణం తీర్చుకోగ అసలు..కుదరనిదే అమ్మప్రేమ..!
బ్రహ్మదేవు డనేవాడు..ఉన్నాడో లేడో కద..
దైవత్వపు పైన ఉండి..తోచనిదే అమ్మప్రేమ..!
ఎంత నరకయాతనైన..తలపోయును స్వర్గముగా..
తన బిడ్డకు బాధ తోచనివ్వనిదే అమ్మప్రేమ..!
తను తిన్నా తినకున్నా..బిడ్డను పస్తుండనీదు..
తేనెకైన అందనంత..తియ్యనిదే అమ్మప్రేమ..!
చిగురాకుల ఊయల కద..తన మనస్సు కలనైనా..
బిడ్డకొరకు గాక ఏమి..దాచనిదే అమ్మప్రేమ..!
