అమ్మ మనసు
అమ్మ మనసు
1 min
4
అమ్మమనసు వర్షించే..మేఘంలా ఉంటుంది..!
అక్షరాల గగనానికి..అద్దంలా ఉంటుంది..!
తన పలుకుల వీణియపై..హంసధ్వని అమృతమే..
నిత్యనూత్న చైతన్యపు..వేదంలా ఉంటుంది..!
హృదయాలను శృతిచేసే..కల్యాణ వాసంతం..
విశ్వప్రేమ పంచు మధుర..సంగీతంలా ఉంటుంది..!
పదములన్ని తన పదముల..నిజార్చనా సుమాలే..
సరిగమపద స్వరముల అనువాదంలా ఉంటుంది..!
శుకశారిక కోకిలముల..సరాగాల సంకీర్తన..
గీర్వాణీ లాస్యారుణ..తీర్థంలా ఉంటుంది..!
