అమ్మ కంటి
అమ్మ కంటి
1 min
6
అమ్మకంటి చెమ్మ తెలిసి..తుడిచేందుకు ఉందెవ్వరు..!?
అసలు నాన్న వేదనేమొ..తెలిసేందుకు ఉందెవ్వరు..!?
పలకరించు దిక్కులేక..పలవరించు ఖర్మెందుకొ..
ఎవరిగొడవ వారిది కద..చూసేందుకు ఉందెవ్వరు..!?
పెరటితోట మొక్కలెంత..దిగులునిండి ఎండేనో..
ఆప్యాయత జలమేదో..పోసేందుకు ఉందెవ్వరు..!?
నిత్యమల్లె చెట్టేమో..మొగ్గతొడగకుంది కదా..
అనురాగపు ఎరువేదో..వేసేందుకు ఉందెవ్వరు..!?
చింతచెట్టు కొమ్మల్లో..ఖాళీగా తేనెతెట్టు..
చిత్రమైన తన గోడును..వ్రాసేందుకు ఉందెవ్వరు..!?

