అన్నదోయి
అన్నదోయి
1 min
0
సహనం తన ముంగిట' నే'..దాసోహం అన్నదోయి.!
త్యాగం తన సన్నిధి 'నే'..ఓ గగనం అన్నదోయి..!
బిడ్డను తన గర్భములో..మోయువేళ భూదేవి కదా..
అనురాగం తన వాకిట..'నే'..మౌనం అన్నదోయి..!
స్థన్యమిచ్చు సందడినే..పండుగలా తలపోయును..
అభిమానం తన మనసున..'నే'..పదిలం అన్నదోయి..!
లాలపోయు వేళలలో..యోగశక్తి నింపు కదా..
చిరునవ్వే తన మోమున..'నే..నిత్యం అన్నదోయి..!
జోలపాడు ముచ్చటలో..సంగీతమె తాను చూడు..
అమృతమే తన పలుకున..'నే'..మధురం అన్నదోయి..!
