అమ్మ ఒడీలో
అమ్మ ఒడీలో
1 min
3
అమ్మ ఒడిలో నేర్చిన భాష...
ఆత్మీయతను పంచే భాష...
ఇష్టంతో నేర్చుకునే భాష...
ఈశ్వరుడిని స్తుతించే భాష...
ఉగ్గుపాలతో నేర్చిన భాష...
ఊహలకందని మధురభాష...
ఋషులందరు పలికినభాష...
ఎందరో మహానుభావులు మెచ్చిన భాష...
ఏడ్చే పిల్లల్ని మరిపించే భాష...
ఐరావతం గురించి వర్ణించిన భాష...
ఒరవడితో నేర్చుకుంటే
నైపుణ్యం రప్పించే భాష...
ఓర్పుగా నేర్పుగా అక్షరాలల్లి
పదబంధం ఏర్పరచిన భాష...
ఔరా అనిపించే పదవిన్యాసంతో
అద్భుతమైన భాష...
అందరు మెచ్చే భాష అజంతా భాష...
అః అనిపించే అందమైన అక్షరమాల...
