అమ్మ
అమ్మ
1 min
1
తన కోసం అసలేమీ..దాచుకోదు అమ్మ..!
తన సుఖమా.! ఏమాత్రం..చూసుకోదు అమ్మ..!
పేగు తెంచుకున్న ప్రేమ..పెదవికేల చిక్కు..
తన చిక్కని మనసు విప్పి..చెప్పుకోదు అమ్మ..!
బిడ్డకొరకు ఎంత తపన..పడుతుందో ఎపుడు..
గాలి కూడ తీరికగా..తీసుకోదు అమ్మ..!
ఎన్ని సేవ లెంతశ్రద్ధగా చేస్తుందోయి..
బిడ్డనుండి తానేమీ..కోరుకోదు అమ్మ..!
బిడ్డ చదువు,బిడ్డ గెలుపు..బిడ్డ లోకమేగ..
బిడ్డతోనె తన స్వర్గం..వదులుకోదు అమ్మ..!
