అమ్మా ఎప్పుడూ
అమ్మా ఎప్పుడూ
1 min
4
అమ్మ ఎప్పుడు ఇంటికొచ్చునొ ఏమి పనియో తెలియకున్నది..!
నాన్న ఎందుకు ముద్దు చేయడొ ఏమి గొడవో తెలియకున్నది..!
చదువు చూస్తే అంతు చిక్కని మోతబరువుగ తయారైనది..!
వింత పరుగుల బ్రతుకులెందుకొ ఏమిజనులో తెలయకున్నది..!
తిండి తిప్పలు మాట సరెలే పలకరించే దిక్కు లేదే..!
ఏమి పట్నమొ ఏమి సంగతొ ఏమి తెలివో తెలియకున్నది..!
లేవు చెట్లే..లేవుగా మరి పూలమొక్కలె..ఓరి దేవుడ..!
ఎవరికెట్లా చెప్పవలయునొ ఏమి దారో తెలియకున్నది..!
చెత్తకుప్పలు మురికి కాల్వల పరిమళాలే ఇచట విందులు..!
డస్టు బిన్లను ఏల వాడరొ ఏమి ప్రజలో తెలియకున్నది..!
