మన కలయిక కథలుగా సాగాలి..
మన కలయిక కథలుగా సాగాలి..
వింటున్నావా చెలి..
మన కలయిక కథలుగా సాగాలి..
మన కథ ప్రణయ కావ్యంలా వ్రాయాలి..
మన ప్రేమ చరిత్రగా చెప్పుకోవాలి..
మన ఊహలన్నీ వర్ణ శోభితమై మెరవాలి..
మన కలం నుంచి భావాలు కవితల నదిలా పారాలి..
మన కలలకు అక్షరాలన్ని అల్లుకుని కావ్యమాలలుగా కూడాలి..
మన ఆశలన్నీ మన అడుగులో అడుగులు వేయాలి..
మన ప్రేమకి కొన్ని వేల భావాలతో రంగులు అద్దాలి..
మన కనుల ఊసులన్నీ కనురెప్పలకు కాపు కాయాలి..
మన ఇద్దరి గుండెల చప్పుడు కలిసి ఒక మధుర రాగమవ్వాలి..
కాలాలు కరిగిపోయినా..
చరిత్ర ముగిసిపోయినా..
మనం మట్టిలో కలిసిపోయినా..
మన కలయిక కథలుగా సాగాలి..
వింటున్నావా చెలి....
