మలుపులు
మలుపులు
పల్లెబాట, పొలంబాటలో మలుపులెన్నో
పల్లెలో మలుపు మలుపుకో వాడనో, ఇల్లో
గడపల్లోకి తొంగి చూస్తే జీవన పాఠాలు
పిల్లో, కుక్కనో, పాడి పశువో, మొక్కలో, చెట్లో
సహజీవనం సాగిస్తాయి మనుషుల మమతలతో
కయ్యాలు, కలిమిలేములు, కష్టాలు, సుఖాలు
కలిసి బతుకుతాయి, గెలుస్తాయి, ఓడుతాయి
ఆ మలుపులన్నీ మార్గదర్శనం చేసుకుంటే
లక్ష్యం చేరే దారిలో ఉండవు కన్నీళ్లు
పొలం బాటలో మలుపు మలుపుకు మారొచ్చు పంటలు
పశువులు వదిలే వ్యర్థాలు చేసుకుంటే ఎరువులు
పట్టించుకోకుంటే కంపు కొట్టు వాసనలు
పంట ఏదైనా కలుపును పెరికేయాలి సమూలంగా
వేసిన పంటలు తీయని ఫలాలందించాలంటే
నీరు పెట్టాలి, చీడ తొలగించాలి
జీవితంలో వయసు పెరిగే కొద్దీ
మలుపు మలుపును చేసుకుంటే ప్రత్యేక గుణపాఠం
భాగాహారాల్లో శేషాలు మిగులొచ్చు, సున్నా కావచ్చు
కూడికలు, తీసివేతలున్నట్లే, గుణకారాలు తగులొచ్చు
అవన్నీ మలుపు సూత్రాలు
పదాలను కలపడానికి మేదో మధనం చేసినట్లే
అర్థాలు దారి తప్పకుండా కనిపెట్టుకోవాలి
కథా కథనంలో మలుపులు అబ్బురపరిచినట్లే
పద్యంతో నిలువెల్లా స్నానం చేస్తే
పునీతం కావాలి, పూలబాట చూపాల
