STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మళ్ళీ మళ్ళీ పుట్టడం

మళ్ళీ మళ్ళీ పుట్టడం

1 min
350

పొద్దు మారే వేళ మనసు పొరల్లో దాగిన రూపం కోసం మది పరితపిస్తోంది...

ముద్దు మోమును ఒకసారి చూడగానే.. 

జీవితానికి చమురు నువ్వే అని...

కొడిగట్టు తున్న ప్రాణదీపం కొత్త వన్నెలద్దుకొని... 

వేయి కాంతులతో వెలిగిపోతుంది...

నీ ఊపిరే నాకు ఉసురయ్యింది కదా...

అందుకే నీ ఉనికి కానక ఆయువు వెక్కిళ్ళు పెడుతోంది...

నీ ముని వేళ్ళు తాకగానే మళ్ళీ మళ్ళీ పుట్టడం అలవాటుగా మారిందేమో... 

తిరిగీ తాజాగా ఒక్కసారి మళ్ళీ పుట్టాలనుంది...


Rate this content
Log in

Similar telugu poem from Romance