మిసమిసలాడే చిన్నది
మిసమిసలాడే చిన్నది
మిసమిస లాడే చిన్నది,
రేవులోన
తాన మాడుతున్నది,
ఒంపుసొంపు వయ్యారాలతో మదినే దోస్తున్నది,
వయసుపోరు ఆపలేనురో,
ఆ చూపువీడి వెళ్ళలేనురో.
పిడికిడంత నడుములో
నా గుండెనే దాస్తున్నది,
కన్నెబుగ్గ సొట్టే కైపెక్కిస్తున్నది,
ఓరచూపుతో
ఆశలే రేపుతున్నది,
పరువపు అందాలతో ప్రేమదాసుడను చేస్తున్నది,
కలలోని ఊర్వశి కన్నా
అందం తనలోనే వున్నది,
ఇలలో నా ప్రేయసిగా
మదినే దోస్తున్నది,
వయసుపోరు ఆపలేనురో,
ఆ చూపువీడి వెళ్ళలేనురో.
అల్లరింకా ఆపవే
ఆశలన్నీ తీర్చవే,
మనువుతో ఇద్దరం ఒకటైతే
ప్రతిక్షణం నవనందనమేనే,
యేటిఒడ్డె మన లోగిలి చేసుకుందామే,
మురిపాల కులుకుల
తాన మాడుకుందామే,
గువ్వల జంటగా ఉండిపోదామే,
మనసు మనసు గుసగుసలతో
బంగారు మమతలు పంచుకుందామే,
వయసుపోరు మరచిపోదామే,
చూపులు కలసిన శుభవేళ ఏడడుగులు నడిచేద్దామే.

