STORYMIRROR

AnuGeetha Adiraju

Inspirational Others

4  

AnuGeetha Adiraju

Inspirational Others

మహావీరా.. నీకు వందనం..

మహావీరా.. నీకు వందనం..

1 min
365

ఓ తల్లీ..భారతావని...🙏

  నీ వొడిలో ఆడుకునే చంటి బిడ్డలం మేము..

  నీ నీడలో ఎదిగే పసిపాపలం మేము..

  నీ దయతో బ్రతికే ప్రాణులమమ్మా..

  ఈ రత్న గర్భలో అడుగెయ్యాలని చూసే తోడేళ్ళ       గుంపులు....

చనుబాలు తాగి తల్లి కుత్తుకని కోసే దుర్మార్గుల మధ్యలో    రొమ్ము విరిచి.. ఎదురు నిలిచి..

   రేయి అనక..పగలు అనక..

   అన్ని ఋతువులలో..అన్ని కాలాల్లో...

   బంధములని..భావములను వీడి..

   పిడికిలి బిగించి నీ పాదపద్మములకు మోకరిల్లి..

   వందే మాతరం...వందే మాతరం...

   అని గళం విప్పి..నడుం కట్టి..

   తమ సర్వస్వం నీకే అంకితమంటూ చేతులు కలిపి 

   వేటాడే సింహాలై..రణరంగమున పోరాడి..

   అమరత్వం పొందిన నీ బిడ్డలైన నా సోదరులకు    భారత జాతి అంతా రునగ్రస్తులై నిలిచాము..

   వీర మరణం పొందిన నా సోదరులను చూసిన ప్రతి భారతీయుని రక్తం ఉడికి....సేగులుగా మారి ...

    అనంత శక్తి రూపమై.........

      యుద్ద భూమిలో పోరాటం సాగిస్తున్న నీ బిడ్డలైన నా సోదరులను చేరి అఖండ భద్ర కాళి అవతారమై...

    దుష్ట సంహారం గావించవలెనని దీవించు తల్లి..


భారత మాతకి జై...🙏

భారత మాతకి జై...🙏

జై జావాన్.... జై హింద్.🙏🇮🇳

                                  -Anu😍



Rate this content
Log in

Similar telugu poem from Inspirational