STORYMIRROR

AnuGeetha Adiraju

Romance

4  

AnuGeetha Adiraju

Romance

మన జంట

మన జంట

1 min
358

కలిసావు నన్ను కలలని చూపావు..

కొలువున్నావు నాలో మదిని దోచావు...

కాలం కరిగినా...రాతలు మారినా....

తీగలా నన్ను అల్లుకున్నావు నిలువెల్లా...

కలలాంటి సమయాలలో ఎదురొచ్చిన చిరునవ్వు నీవు..

కదలనివ్వక పెనవేసిన బంధానివి నీవు...

    ఏ జన్మ వరమో నా ఈ సంపద...

    నువ్వు చేరువైన నా ఎద మురవదా......

ఎన్ని సార్లు చెప్పను గుండె చప్పుడు నువ్వే...

ఏ చోటకి వెళ్లిన మనసున ఉన్నది నీ తలపులే...

   ప్రాణం పోయినా ప్రేమని మరువను....

   ప్రాణం ఉన్నంత వరకు నీ చేయి వదలను...

ఇంతకంటే గొప్పగా ఏమని చెప్పను...

   నాలోని అణువణువు నీవే నీవే....

  నాదంటూ ఉన్న నా జన్మ నీదే నీదే.....


Anu😍


Rate this content
Log in

Similar telugu poem from Romance