STORYMIRROR

AnuGeetha Adiraju

Classics Inspirational Others

4  

AnuGeetha Adiraju

Classics Inspirational Others

మహిళా దినోత్సవం

మహిళా దినోత్సవం

1 min
304

ఓ వనిత...ఓ యువతి..

తెరిచి చూడు నీ ఘన చరిత్ర...

నేడే నీకు వేదిక...

   ఎన్నెన్నో విజయాలు సాధించిన మహిళవి.....

   అబల అను మాటను మార్చి రాసిన బలానివి...

   నలుదిక్కుల వ్యాప్తి చెంది పొందితివి కీర్తిని...

   సమానములకై పోరాడి విజయ పతాకం ఎగరేసితివి...

   కనువిప్పు కలిపించితివి..కలలని కైవసం చేుసుకుంటివి 

   బానిసను కానంటివి...గృహలక్ష్మివై వెలిగితివి...

ఓ మగువా...ఓ స్త్రీ...

తెరిచి చుడు నీ ఘన చరిత్ర...

నేడే నీకు వేదిక...

    అనిగిమనిగి ఉంటివి...వెట్టి చాకిరి చేస్థివి.

    గొంతు మెదప కుంటివి ..కసాయి పాలు అయితివి...

    తిండి గుడ్డ చాలదే...పస్తులే కడుపుకే...

    ఆదరించే అమ్మవి...త్యాగమూర్తివి ఐతివి...

    అంత భారం మోస్తివి...జన్మనే అర్పించితివి..

    సహనమూర్తివైతివి....కరుణతో మెలిగితివి...

ఓ పడతి... ఓ ఇంతి...

తెరిచి చూడు నీ ఘన చరిత్ర..

నేడే నీకు వేదిక...

     ఉద్భవించితివి ఉద్యమానివై...

     నడుము కట్టి ముందుకు అడుగేస్తివి...

     నమ్మకాన్ని నిలబెట్టుకుంటివి..

     పట్టిన పట్టు విడువకుంటివి....

     పాపాత్ములకు అపర కాళికవు అయితివి...

     చండాలులకి మహిషాసుర మర్ధినివి..

     ఎదురులేని గెలుపే నీది...

     ఎదుర్కోలేని సాహసం నీది....

వందనాలు నీకు మహా కనకదుర్గ....

     నమస్సుమాంజలి నీకే లలితాంబికా...

Anu❤️


     


     

    

    


    








Rate this content
Log in

Similar telugu poem from Classics