STORYMIRROR

M " S R R" ✍️.

Inspirational

4  

M " S R R" ✍️.

Inspirational

మహాత్మా గాంధీ- సుశీల రమేష్

మహాత్మా గాంధీ- సుశీల రమేష్

1 min
530

ఆడది అర్ధరాత్రి నిర్భయంగా

తిరిగిన నాడు స్వాతంత్రం

వచ్ఛినట్టు అన్న మహాత్ముని

మాటకు తూట్లు పొడిచారు.

నేడు పట్టపగలు కూడా భద్రత

లేకుండా పోయింది పడతికి.

సత్యము అహింస మార్గాన్ని

చూపిన బాపు అడుగుజాడలలో

నడవడం మానేశారు.

కులమతాలన్నీ ఒకటే అని

చాటి చెప్పెను మహాత్మా గాంధీ.

కొల్లాయి గట్టి, కర్ర చేతబట్టి

నూలువడికి, మురికివాడలు

శుభ్రం చేసిన మహనీయుడు.

ప్రతి ఒక్కరూ శ్రమించాలని, ఉన్నదే

నలుగురు పంచుకోవాలని,

పంతులుగా వంటవాడిగా

పాకి వాడిగా సహజీవన

విధానంలోని సీదా సాదా

జీవనం గురించి చాటిచెప్పిన

మహోన్నత వ్యక్తి మన జాతిపిత

మహాత్మా గాంధీ గారు.


ధన్యవాదములు 💐



Rate this content
Log in

Similar telugu poem from Inspirational